అగ్నికులక్షత్రియయువతకు
విజ్ఞప్తి!
అగ్నికులక్షత్రియులను
S.T.లలో
చేర్చాలని గట్టిప్రయత్నము
జరుగుతుంది.
బెస్త,
జాలరి,
పల్లి
మొదలగు 14
కులాలతో
కలిసిన అగ్నికులక్షత్రియులు
కోటిన్నరమంది ఉన్నారని అంచనా
వేస్తున్నారు.
అందరూ
50,
60 సం||ల
నుండి B.C.లలో
ఉండి వారికి ప్రభుత్వము
కల్పించు B.C.రిజర్వేషన్
వినియోగించుకొని లక్షలాది
మంది అగ్నికులక్షత్రియులు
అభివృద్ధి చెంది ఉంటారు.
అయినా
వారు బ్రతుకుతెరువు కొరకు
చేపట్టిన వృత్తిలోనే కొనసాగుతూ
వారి అభివృద్ధిని బాహ్యప్రపంచానికి
తెలియకుండా దాచుకొని వారికి
ప్రభుత్వం కల్పించిన B.C.
రిజర్వేషన్
వల్ల ఎటువంటి ప్రయోజనము
కలగలేదని,
ఎక్కడ
వేసిన గొంగళి అక్కడే అన్నట్లు
రిజర్వేషన్స్ అమలులోకి
రాకపూర్వము ఎలా ఉన్నారో
ఇప్పుడూ అలానే ఉన్నారన్నది
ప్రస్తుతం ST
రిజర్వేషన్
కొరకు పోరాడుతున్న వారి
అభిప్రాయమా?
లేదు....
BC రిజర్వేషన్
వల్ల ఎటువంటి అభివృద్ధి
లేదు...
STలలో
చేరితేనే అభివృద్ధి ఉంటుంది
అన్న అభిప్రాయమా?
మరి
BC
రిజర్వేషన్
ఉపయోగించుకొని అభివృద్ధి
చెందలేని వారు,
సమాజంలో
చిన్నచూపు చూడబడటానికి కారణమైన
వారి వృత్తిని వదలలేనివారు
రేపు ST
రిజర్వేషన్
ఉపయోగించుకొని అభివృద్ధి
చెందగలరని గ్యారెంటీ ఉందా?
వారు
-
ఆర్థికంగా,
సామాజికంగా,
రాజకీయంగా
ఎదిగి ప్రస్తుతము వీటితోపాటు
ఉభయ మీడియాలను,
సినిమా,
కళలు,
సాహిత్యము,
విద్య
మొదలగు రంగాలను వారి గుత్తాధిపత్యము
క్రింద నడుపుతున్న అగ్రకులాల
సరసన నిలబెట్టగలరా?
అబ్బెబ్బే!
అంతలేదంటారేమో!
మరి
అభివృద్ధికి నిర్వచనమేమిటి?
ప్రభుత్వమునుండి
ఎటువంటి సహకారము అందుకోకుండా
సమాజాన్ని శాసించే స్థితికి
ఎదిగిన ప్రధాన కులాలు రెండింటిలోనూ
-
పుట్టిన
ప్రతి ఒక్కడు పుడుతూనే నోట్లో
బంగారుచెంచాతో పుట్టలేదు.
పైగా
వారి వృత్తి వ్యవసాయము ఒక్కటే.
దాని
ద్వారా బ్రిటిష్ పాలనాకాలంలో
వారికి అందివచ్చిన చేయూతద్వారా
వారు అభివృద్ధి చెందలేదా?
ఇప్పుడు
వారు ప్రభుత్వంనుండి ఏ సహకారమూ
ఆశించడం లేదు.
స్వయంకృషితో,
స్వయంపోషకత్వంతో
వారు అభివృద్ధి చెందారు.
చెందుతున్నారు.
కాని
అగ్నికులక్షత్రియులు వ్యవసాయము,
నౌకాపరిశ్రమ,
దానికి
అనుబంధంగా ఉన్న వడ్రంగము,
నౌకాయానము,
విదేశీ
నౌకా వ్యాపారము,
కమ్మరము,
శిల్పకళ
మొదలగు అనేక వృత్తులలో ఉన్నారు.
ఇవన్నీ
వదిలేసి కులపెద్దలు కొందరు
మన కులవృత్తి చేపలవేటగా
నిర్ణయించి,
అగ్నికులక్షత్రియులను
ఆత్మన్యూనతకు లోనుచేసి ఆ
వృత్తితో ఎటువంటి సంబంధమూ
లేని అనేక వేల కుటుంబాలవారికి
సమాజంలో విలువ లేకుండా చేశారు.
అది
చాలదన్నట్లు ప్రస్తుతము
అగ్నికులక్షత్రియులను ST
లలో
చేర్పించి,
చెంచు,
సుగాలి,
ఎరుకల,
యానాది
తదితర 35
కులాల
సరసన కూర్చోబెట్టడానికి
తీవ్రంగా కృషి చేస్తున్నారు.
పరిణామ(మార్పు)
క్రమంలో
ఒక జీవి అభివృద్ధి దిశగా
పయనించాలి.
పతనంవైపు
కాదు.
కాని
అగ్నికులక్షత్రియుల పూజ్యపెద్దలు
ఒకప్పుడు OCలలో
ఉన్న కులాన్ని BCలలోకి
మార్పించారు.
BCలలోకి
మార్చడం వల్ల వారు ఆశించినది
నెరవేరుతూనే ఉంది.
అవసరమున్న
వారు దాన్ని ఉపయోగించుకుంటూనే
ఉన్నారు.
అయినా
BCరిజర్వేషన్
వల్ల ఆశించిన ఫలితం దక్కలేదనే
నెపంతో మరలా STలలోకి
మారడానికి కృషి మొదలుపెట్టారు
పూజ్యపెద్దలు కొందరు.
అంతగా
STలలో
చేర్చడం తప్పనిసరి అయితే
అగ్నికులక్షత్రియులుగాక
మిగిలిన అసలు సిసలైన 14
మత్స్యకార
కులాలను ST
లలో
చేర్చుటకు కృషిచేసి,
పోరాడి
సాధించవచ్చు.
అగ్నికులక్షత్రియులను
స్వయంకృషితో స్వయంపోషకత్వంతో
అభివృద్ధి చెందునట్లు
మార్గదర్శనం చేయవచ్చు.
ఇందువల్ల
వారు బ్రతుకుతెరువుకొరకు
ఏర్పరుచుకున్న ఏ వృత్తినీ
వదులుకోనక్కరలేదు.
అందులోనే
కొనసాగుతూ దివ్యమైన జీవితం
గడుపుతూ,
సమాజంలో
వారు కోల్పోయిన విలువలను
పునరుద్ధరించుకోవచ్చు.
అగ్నికులక్షత్రియ
సోదరీ సోదరులారా!
మేల్కొనండి!!
సమాజంలో
అగ్నికులక్షత్రియులు కోల్పోయిన
విలువల పునరుద్ధరణకు కృషిచేద్దాం
రండి!!
నిస్వార్థంగా
కృషిచేయగల నూరుమంది కలిస్తే
కొండలను సైతం పిండిచేయవచ్చు
.
ఆలోచించండి!!!
…....................................................................................................................................................................................................
ఒడుగు
నరేష్ వర్మ - 9700472572
Agnikula kshatriyulu chapalu, vudatalu pattevaru kadu. Agnikula kshatriyulu barata deshapu prachekamaina goppa maha veera sainyha samuhamu. Elanti goppa maha veera vamshani s.t. lo pettakandi.endhukante vuru marinatha matrana gunam marutundha? Manam agnikula kshatriyulamu mana kula vruthi rajyapalana,dusta shikshana, sista rakshana. Anthe kani megata a paniki manam suite kamani na abiprayam.
రిప్లయితొలగించండి