కరపత్రము - 4
సంఘేశక్తిః కలౌయుగే
కృణ్వంతో విశ్వమార్యం
అగ్నికులక్షత్రియ సోదరులకు విజ్ఞప్తి,
నేడు అగ్నికులక్షత్రియు (అ.క్ష.)లని పిలువబడేవారు ఆనాటి పల్లవులేననేది నిర్వివాదాంశము. దానికి ప్రత్యేకమైన ఋజువులు వెదుకనక్కరలేదు. "పల్లవ" అను పదమే "పల్లి"గా మారిందని, రెండూ ఒక్కటేనని చారిత్రకాధారాలు లేని ఊహాత్మక నిర్ణయానికి వచ్చి అలాగే చెప్పుకొని సమాజం చేత అ.క్ష.లందరూ మత్స్యకారులేనని, మత్స్యకారులందరూ అ.క్ష.లేనని చెప్పబడుతూ అణచివేయబడి ఆత్మన్యూనతకు లోనవడం అంగీకారయోగ్యంకాదు.
పల్లవులు హిందూధర్మ రక్షణకు పాటుపడి అనేక హిందూదేవాలయాలను నిర్మించినట్లు చారిత్రకాధారాలున్నవి. పల్లవ రాజవంశపాలన కాలంలో నౌకానిర్మాణమును, నౌకాయానమును అభివృద్ధి చేసి దూరస్థ తూర్పుదీవులలోను, తూర్పుదేశాలలోను వలసరాజ్యములేర్పరిచి వ్యాపారాభివృద్ధి చేసి ఆంధ్రదేశానికేకాక యావద్భారతదేశానికి దిగంతవిశ్రాంత కీర్తిని గడించినట్లు చరిత్ర ఉంది. (భావరాజు వేంకటకృష్ణారావు గారి "ప్రాచీన ఆంధ్రనౌకాయానము"). నేడు పల్లవ అను పదమును పల్లిగా మార్చి చెప్పుకొని, అలాగే పిలువబడుతున్న అ.క్ష.లకు పై రెండు అంశాలతో ఎంతో ఘనమైన అనుబంధమున్నది. ఈ యాంత్రికయుగంలో నౌకాయానవృత్తి, నౌకావ్యాపారము అ.క్ష.లకు దూరమైనా దేవాలయ వ్యవస్థ మాత్రము ఇంకా పూర్తిగా వారికి దూరం కాలేదు. నెల్లూరు జిల్లాలోను, తమిళప్రాంతాల్లోనూ అనేక దేవాలయాలు అ.క్ష.లు లేక వహ్నికుల క్షత్రియుల ఆధీనంలోనే ఉండి,
వారే పూజారులుగా నడచుచుండుట ఇందుకు నిదర్శనము.
ప్రస్తుతం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారి మాత వకుళాదేవి ఆలయము అన్యాక్రాంతమై శిథిలావస్థలో ఉంది. ఆ ఆలయ పునరుద్ధరణకు కాకినాడ శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద సరస్వతి వారు చేస్తున్న ప్రయత్నము లోకవిదితము.
తిరుమలతిరుపతి దేవస్థానంతో పల్లవులకు ప్రత్యక్ష అనుబంధము వున్నట్లు
శాసనాధారాలు దొరుకుచున్నవి. ఆంధ్రదేశంలో పల్లవుల పాలన అంతమైన తర్వాత దక్షిణభారత దేశంలో పల్లవులు పరిపాలనా కాలమైన క్రీ.శ.7వ శతాబ్ద ఆరంభంనుండి స్థానిక రాజకుటుంబాలకు చెందిన రాకుమారులు, ప్రముఖ నాయకులు, పల్లవ రాజుల ఆధీనములోని పాళెయగారులు మొదలైన వారు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాభివృద్ధికి తోడ్పడ్డారు. పల్లవరాజుల కాలానికే చెందిన రాణి సామవై 8, 9 సంఖ్యలుగల రెండు శాసనములు వేయించింది. శ్రీ వేంకటేశ్వరుని మూలమూర్తిని పోలిన ఒక వెండి ఉత్సవమూర్తిని వివిధ ఆభరణాలతో అలంకరింపజేసి సంవత్సరానికొక్కమారు ఒక వారంరోజులపాటు రెండుపూటలా ఊరేగింపుతో ప్రత్యేక ఉత్సవం జరిగే ఏర్పాట్లు చేసినట్లు ఆ శాసనాలవల్ల తెలుస్తున్నది. నిత్యదీపనైవేద్యాల కొరకు ఆమె ఏర్పాటు చేసింది. ఇంకా ఆమె భాద్రపదము, మార్గశిరమాసాలలో ఉత్సవాలు జరిగేటట్లు ఏర్పాటు చేసినట్లుగా ఆ శాసనాలవల్ల తెలుస్తున్నది. పల్లవుల తర్వాత రాజ్యాధికారం చేపట్టిన చోళరాజులు కూడా పరిపాలన సౌలభ్యం కొరకు పల్లవుల సామ్రాజ్యకాలంలో అవలంబించిన ప్రాంతవిభాగ పద్ధతి ఆ తర్వాతి కాలంలో కూడా అమలులో ఉండినది. వాటి పేర్లు కూడ మార్చబడకుండా యథాతథంగా ఉంచబడ్డాయి. పల్లవుల కాలానికు పూర్వం పూజలకొరకు తిరుమల దేవాలయానికి చేరడం కష్టసాధ్యంగా వుండి పూజలు సరిగా జరిగేవికావట. పల్లవుల పాలన కాలంలోనే ఆలయానికివెళ్ళి పూజలు చేసే విధానం ప్రాచుర్యానికి వచ్చివుంటుంది. (సప్తగిరి 12/08, 1/2000)ఈ విధంగా కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయము పల్లవ రాజవంశ పాలనాకాలంలో ఎంతగానో అభివృద్ధి చెందింది. అప్పుడు ఏర్పాటు చేయబడిన దేవాలయ పాలనా పద్ధతులు, ఉత్సవాలు యధాతథంగా ఇప్పటికీ కొనసాగుచున్నవి. ఇది అతి పురాతన కాలంనుండి కొనసాగుచున్న చారిత్రకాంశం.
ఇటీవల విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి హిందూ దేవాలయ వ్యవస్థకు కులాలతో గల సంబంధమును వివరిస్తూ దేవాలయాలు నిర్మాణం చేసేపని అ.క్ష.లది అని చెప్పారు. (ఆంధ్రజ్యోతి 29.04.2009). అ.క్ష.లే పల్లవులని ఆధారాలున్నవి. అలా ఋజువు చేయుటకు ప్రత్యేకంగా శ్రమపడనవసరంలేదు. అ.క్ష.లే పల్లవులని చెప్పడంలోగల లోపాన్ని సరిచేసి జీవనాధారంగా చేపట్టిన ఏ వృత్తులకైనా అతీతంగా ఎదిగి సమాజాన్ని ముందుండి నడిపించగల స్థాయికి ఎదుగుటకు తగిన కృషి జరగాలి. కనుక అన్యాక్రాంతమైన శిధిలావస్థకు చేరుకున్న వకుళమాత దేవాలయ పునరుద్ధరణకు స్వామి పరిపూర్ణానంద సరస్వతి వారు తలపెట్టిన కృషి ప్రారంభమైనప్పుడు అ.క్ష.లు కూడా పాలుపంచుకొని తను, మన, ధన పూర్వకంగా శక్తిమేరకు సహకారమందించి తద్వారా తమ నిజస్వరూపాన్ని సమాజానికి చెప్పకనే చాటిచెప్పుటకు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే మంచిదని నా భావన.
నా అభిప్రాయానికి రాజకీయాలకు అతీతంగా పాజిటివ్‌గా స్పందించినవారు, రాష్ట్రసంఘ నాయకులు స్వామి పరిపూర్ణానంద సరస్వతి వారితో సంప్రదించి తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుటకు ప్రేరణ కలిగించవలసినదిగా మనవి.
వెయ్యిమాటలకన్న ఒక పని ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది.