యజ్ఞం
ప్రసంగిస్తున్న శ్రీకోలాబాలాజీగారు
**అక్ష-2013**
అగ్నికులక్షత్రియ అభ్యుదయ మహాసంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీకమాసవనభోజన మహోత్సవ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముందుగా అనుకున్న విధంగా గన్నవరం వద్ద కాకుండా పటమట ఎన్.ఎస్.ఎం.స్కూలు ఎదురు వీధిలో ఉన్న శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ధ్యానమందిరములో కార్యక్రమము కొనసాగించాము. 40మంది హాజరయిన ఈ కార్యక్రమంలో సంఘం ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను వడుగు నరేష్ వర్మ తన ప్రసంగంలో చర్చించారు. ఆ తర్వాత నేను ఇంకొన్ని వివరాలను జోడించాను. 1901లో ప్రారంభమైన అగ్నికులక్షత్రియ మహాసంఘం ఆ తర్వాత ఏ విధంగా రూపాంతరం చెంది, అసలు లక్ష్యాలకు దూరమైందో అన్న విషయం వివరించాను. There can be a positive result in a wisely handled risk అన్న ఆశావహ దృక్పథంతో నిరంతరం అగ్నికులక్షత్రియుల అభ్యున్నతికి అంకితమయ్యే ఉద్దేశంతో ఉన్న "యువత" నడుంబిగించి ముందుకు కదిలితే లక్ష్యాన్ని ముందుగా చేరుకోవచ్చు.
ముందు యజ్ఞంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాలనుకున్నాము. కానీ ధ్యానమందిరంలో చేయడానికి ఆలయంవారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో యజ్ఞం ఇంటివద్దనే చేశాము. అందరూ ఉంటే బాగుండేది. సుమారు ఒక గంటన్నర సేపు జరిగిన యజ్ఞంయొక్క ప్రాశస్త్యము, ఉపయోగాల గురించి వివరిస్తూ శ్రీతమ్ము యుగంధరవర్మ గారు ఈ యజ్ఞకార్యక్రమాన్ని జరిపించారు. ఆ తర్వాత యజ్ఞప్రసాదాన్ని భోజనాలతోపాటు పంచారు. ఆహూతులతో questionere పూర్తిచేయించారు.
అవనిగడ్డనుండి వచ్చిన శ్రీకోలాబాలాజీగారు విద్యపరంగా అగ్నికులక్షత్రియులకు జరుగుతున్న అన్యాయాలను, ఏ విధంగా చేస్తే వాటిని అధిగమించవచ్చు అన్న అంశాలమీద 40నిముషములపాటు ప్రసంగించారు. ఎన్నో అమూల్యమైన విషయాలను చర్చించారు. ఆ తర్వాత శ్రీకొపనాతి విజయవర్మ, శ్రీపీతా అశ్విన్ కుమార్ తదితరులు ప్రసంగించారు. శ్రీ అశ్విన్ కుమార్ భగవద్గీతకు, రైలుప్రయాణానికి అనుబంధంగా చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.
చివరలో ఒక యువకుడు పల్లెకారు అని పిలిపించుకోవడానికి ఏం అభ్యంతరం అని ఒక ప్రశ్న లేవనెత్తారు. ఇంతకు ముందునుండే అలా పిలిపించుకున్నాం కదా! ఇప్పుడేంటి అభ్యంతరం అన్నది అతని ప్రశ్న. "నిజమే. నిన్నటిదాకా ఏవేవో పేర్లతో పిలుచుకున్నవాళ్ళంతా ఈరోజు ఏదో ఒక "...క్షత్రియ"అని పిలిపించుకుంటున్నారు. మనది పాలకవర్గం... పల్లవవంశానికి చెందినవాళ్ళం... అని నిజమైన చరిత్రను తెలుసుకోండి. అంతేకాని పల్లీలన్నా, పల్లవులన్నా ఒకటే అని (అయితే అయి ఉండవచ్చు)... పల్లీలని, పల్లెకార్లని పిలిపించుకోవడానికి అభ్యంతరం ఏమిటని మాత్రం అనవద్దు. అటువంటివాళ్ళకి ఒకటే ప్రశ్న... నీచంగా భావం ధ్వనించేలా పల్లెకారు అని పిలిపించుకోవడం ఎందుకు? పల్లవులు అనే పిలిపించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయరు? అదైనా నాలుగు అక్షరాలే, ఇదైనా నాలుగు అక్షరాలే కదా! ఒకసారి ఆలోచించండి" అని సమాధానమిచ్చాము.
"అగ్నికులక్షత్రియ అభ్యుదయ మహాసంఘం" ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్తీకమాస వనభోజన మహోత్సవం కాస్తా మందిరభోజన మహోత్సవంగా మారి విజయవంతంగా ముగిసింది.
విచ్చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదములు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి