'సంఘేశక్తి
కలౌయుగే -
కలియుగంలో
సంఘానిదే శక్తి'
మత్స్యకారేతర
అగ్నికులక్షత్రియ సోదరులకు,
మన
కులస్తులు జీవనాధారంగా అనేక
వృత్తులు,
వ్యాపారాలు,
ఉద్యోగాలు
చేపట్టియున్నారు.
అందులో
చేపలుపట్టి అమ్ముకునే మత్స్యకార
వృత్తి ఒక జీవనాధార వృత్తి.
ఈ
వృత్తే సమాజంలో మన కులానికి
హీనమైన గుర్తింపుకు కారణము.
మత్స్యకార
వృత్తి కేవలము అగ్నికులక్షత్రియులకే
పేటెంట్ హక్కు కాదు.
అందులో
అనేక ఇతర కులాల వారు ఉన్నారు.
కమ్మవారు,
రాజులు
కూడా వారి పొలాలను చెరువులుగా
మార్చి ఈ వృత్తి చేపట్టినవారున్నారు.
కాని
మన సంఘ పెద్దలు కొందరు
మత్స్యకారవృత్తిని మన
కులవృత్తిగా డిక్లేర్ చేసి
దాని అభివృద్ధికి,
దానిలో
తలెత్తే అనేక సమస్యల పరిష్కారమునకు
తలమునకలుగా విఫలయత్నం
చేస్తున్నారు.
ఆ
వృత్తిలో తరతరాలుగా ఏ కాలంలోనూ
ఎటువంటి సంబంధమూ లేని వేల
కుటుంబాలవారు ఉన్నారు.
ఉదాహరణకు...
వ్యవసాయము,
నౌకానిర్మాణము,
దాని
అనుబంధ వృత్తులయిన వడ్రంగము,
కమ్మరము
. కొద్ది
సంవత్సరాల క్రితంవరకు నౌకాయానము,
నౌకావ్యాపారము
మొ||
అనేక
వృత్తులలో గౌరవప్రదమైన
గుర్తింపు కలిగియున్నారు.
అటువంటి
వారు కూడా ఈ కులవృత్తి నినాదము
వల్ల సమాజంలో మత్స్యకారులుగానే
పరిగణింపబడుచూ అణగారి ఉండవలసిన
దుస్థితిలో ఉన్నారు.
సమాజంలో
మత్స్యకారవృత్తికి కలిగిన
హీనమైన గుర్తింపును (దీనికి
స్పష్టమైన కారణం ఎవరూ చెప్పలేరు)
తొలగించే
ప్రయత్నం ఇంతవరకు సక్రమమైన
మార్గంలో జరగలేదనే చెప్పాలి.
ఎందుకంటే
ఆ వృత్తిలో ఉన్నవారికి సమస్యను
గుర్తించే శక్తిలేదు.
ప్రతి
దినము వారికి కావలసింది వారికి
అందుతున్నది కనుక సమస్యను
గురించి ఎవరైనా వివరించినా
ఒప్పుకోరు.
ఇక
ఆ వృత్తిలో లేనివారైతే తమ
కులమేమిటో సాధ్యమైనంతవరకు
బయటపడకుండా కాపాడుకుంటారు.
మన
కులవృత్తి సమస్య చాలా జటిలమైనది.
కులం
పేరు చెబితే ఆత్మన్యూనత,
చెప్పకపోతే
ఆత్మద్రోహము.
ప్రస్తుతము
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడి
నడుస్తున్న అగ్నికులక్షత్రియ
సంఘాలు సమాజంలో కేవలము మన
కులానికే కాక ఇతర అనేక కులాలకు
సంబంధం గల మత్స్యకారవృత్తి
గురించి పోరాటమో లేక ఇంకేదైనా
చేసినా విజయంమాత్రం శూన్యము.
ఈ
వృత్తితో సంబంధం లేని కళ్ళు
మూసుకున్న పిల్లుల్లాంటివారు
బయటకిరారు,
వారి
సహకారం అందించరు.
కొన్ని
సూచనలు :
1.
ప్రస్తుతము
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న
సంఘాలను మత్స్యకారుల కులవృత్తి
అభివృద్ధికొరకు వదలి,
మత్స్యకారవృత్తిలో
లేని అగ్నికులక్షత్రియులందరూ
సంఘటితమై వేరొక సంఘాన్ని
స్థాపించి దాని పేరును
అగ్నికులక్షత్రియ (పల్లవ)
సేవాసంఘంగా
ఉంచి స్వయంపోషకత్వంలో
అగ్నికులక్షత్రియులు
సామాజికంగా,
రాజకీయంగా,
ఆర్థికంగా,
సాంస్కృతికంగా,
కళారంగంలోను,
ఆధ్యాత్మికరంగం
లోను అభివృద్ధి చెంది,
మన
కులానికిగల పూర్వపుటౌన్నత్యాన్ని
పునరుద్ధరించే విధంగా కృషి
చేసి కులం దాచుకునే పరిస్థితినుండి
బయటపడాలి.
2.
సంఘానికి
ఒక చిన్న ఆఫీసు ఉండాలి.
ఉద్యోగస్తులు
ముఖ్యంగా రికార్డింగ్ సెక్రటరీ,
ట్రెజరర్
/
క్లర్క్,
అటెండరు,
వాచ్
మెన్ ఉండాలి.
3.
సంఘానికి
సభ్యత్వము కనీసం 10వేలు
ఉండాలి.
(వారికి
ప్రవేశరుసుము రూ.11.25పై.,
ప్రతినెలా
రూ.12.00
చెల్లించగలిగినవారు
ఉండాలి.)
సంఘకార్యవర్గ
సభ్యులు నిజాయితీగా ఉండాలి.
ఖచ్చితంగా
పనిచేయాలి.
సంఘంలో
ప్రవేశరుసుమునుండి ఆఫీసు
ఫర్నిచర్,
స్టేషనరీ
మొ||గు
వాటికి ఖర్చుచేయాలి.
నెలసరి
చందా 12రూ.లలో
రూ.3.00లు
స్థానిక కార్యకర్తలకు,
రూ.3.00లు
సంఘ ఆఫీసు అద్దె,
ఉద్యోగస్తుల
గౌరవ వేతనంగా గానీ,
పూర్తివేతనంగాగానీ
ఖర్చు చేయవచ్చు.
రూ.6.00లు
బ్యాంకు డిపాజిట్ చేసి దానిపై
వచ్చు వడ్డీతో మూడవ సం||మునుండి
సేవాకార్యక్రమాలు చేపట్టవచ్చు.
5సం||లు
పూర్తయేటప్పటికి అసలు డబ్బు
36లక్షలు
నిల్వ ఉంటుంది.
ఈ
5సం||లలో
వడ్డీ రూ.4,30,000లు
సేవాకార్యాక్రమాలకు ఖర్చు
చేయవచ్చు.
ఇందుకు
ఒక ట్రస్ట్ ఏర్పాటుచేసుకోవచ్చు.
ఆలోచించండి.....
సంఘటిత
శక్తికి ఏనాడూ తిరుగులేదు....
ఆశక్తి
మనకు కావాలి!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి